ఏపీలో పోలీసుల తీరును రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ముఖ్యమంత్రిని టీడీపీ నేత దూషిస్తే పోలీసులు అంతగా అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. గౌరవ ప్రతిష్ఠలనేవి అందరికీ ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరి మర్యాదను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానించింది. పోలీసుల వ్యవహార శైలిపై అభ్యంతరాలతో కోర్టుకు పలు పిటిషన్లు వస్తున్నాయని.. పట్టాభిరామ్ అరెస్టులో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పట్టాభిని అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లామని పోలీసులు చెబుతున్నారని.. మరోవైపు సీఆర్‌పీసీ సెక్షన్ 41-ఏ ప్రకారం నోటీసులిచ్చాం కానీ.. సహకరించలేదని.. అందుకే అరెస్టు చేశామంటూ పరస్పర విరుద్ధమైన, పొంతన లేని సమాచారాన్ని దర్యాప్తు అధికారి రిమాండు రిపోర్టులో పేర్కొన్నారని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది.
Also Read: Weather Update: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు.. ఆ ప్రాంతాల్లో వర్షాలు
అరెస్టు చేసే ఉద్దేశం ఉంటే 41-ఏ నోటీసు ఎందుకిచ్చారని ప్రశ్నించింది. ఆ నోటీసు ఇచ్చాక మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారని అడిగింది. ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన పట్టాభిరామ్‌కు హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. రూ.20 వేల బాండుతో రెండు పూచీకత్తులు దిగువ కోర్టులో సమర్పించాలని స్పష్టం చేసింది. బెయిలు ఇవ్వొద్దన్న ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
Also Read : పట్టాభికి బెయిల్ - టీడీపీ ఆఫీస్‌పై దాడి చేసిన వారిలో 10 మంది అరెస్ట్ !
ఆ సెక్షన్లు కరెక్టే..
పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. పట్టాభిపై నమోదు చేసిన సెక్షన్లు సరైనవేనని.. సీఎంపై పిటిషనర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పిటిషనర్ ప్రెస్‌మీట్ వీడియోను పరిశీలించండి. బెయిలు ఇవ్వొద్దు. ఇస్తే పబ్లిక్ ఆర్డర్ ఉల్లంఘన అయ్యే అవకాశం ఉందని కోరారు. కానీ, ఏజీ నిబంధనలను హైకోర్టు తోసిపుచ్చింది.
Also Read: దీపావళికి ఇంటికి వెళ్తున్నారా? మీకోసం ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.. చూడండి
Also Read: చంద్రబాబు ఢిల్లీ టూర్ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?