దీపావళికి ఇంటికి వెళ్లాలనుకునేవారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీ కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ననపనుంది. వైజాగ్-సికింద్రాబాద్, విశాఖపట్నం – తిరుపతి మధ్య ప్రత్యేక వీక్లీ రైళ్లను నడవనున్నాయి. అయితే ఈ స్పెషల్ రైళ్ల కోసం.. రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక రైళ్లను నడిపే తేదీలు, రైలు నంబర్, ఏ స్టేషన్‌లో ఎన్ని గంటలకు బయల్దేరుతుంది.. గమ్యస్థానానికి చేరే సమయమెంత? అనేవి దక్షిణ మధ్య రైల్వే ట్టిట్టర్ లో పోస్టు చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి
నవంబరు 2న (మంగళవారం) సాయంత్రం 5.35 గం.లకు విశాఖపట్నం నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు(నెం.08585) బుధవారం ఉదయం 07.10 గం.లకు సికింద్రాబాద్ చేరుకోనుంది. నవంబరు 3న(బుధవారం) రాత్రి 09.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరనున్న ప్రత్యేక రైలు (నెం.08586) గురువారం ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ రైల్వేస్టేషన్లలో ఆగనుంది. ఈ స్పెషల్ ట్రైన్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
Also Read: Weather Update: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు.. ఆ ప్రాంతాల్లో వర్షాలు