ఏపీ ఇంటర్మీడియట్‌ మొదటి, రెండు సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా వృత్తి విద్య, కొన్ని సబ్జెక్టులను ఆన్‌లైన్‌ లో మూల్యాంకన చేశారు. ఈ నెల 26 నుంచి నవంబరు 2 వరకు ఆన్సర్ పేపర్స్ రీవాల్యుయేషన్, పరిశీలనకు అవకాశం కల్పించారు. రీవాల్యుయేషన్ పేపర్‌కు రూ.260, స్కాన్‌కాపీ, రీవెరిఫై పేపర్‌కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఇందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. స్కానింగ్‌ ఆన్సర్స్ పత్రాలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్‌, వృత్తి విద్యా విద్యార్థులు 3,24,800 మంది, రెండో ఏడాది పరీక్షలకు సాధారణ, వృత్తి విద్య కలిపి 14,950 మంది విద్యార్థులు హాజరయ్యారు. షార్ట్‌ మెమోలను ఈ నెల 25న నుంచి bie.ap.gov.in ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


Also Read: ఏడో తరగతి పూర్తైన బాలికలకు అద్భుత అవకాశం.. RIMCలో ప్రవేశానికి TSPSC ప్రకటన జారీ 


ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


http://examresults.ap.nic.in/ 


https://results.apcfss.in/ 


కోవిడ్ ప్రొటోకాల్ తో పరీక్షలు నిర్వహణ


కోవిడ్‌ కారణంగా ఏపీ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేసింది. విద్యార్థులకు మరింత మేలు చేసేందుకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించింది. విద్యార్థుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖ తెలిపింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థర్మల్‌ స్క్రీనింగ్, మాస్కులు ధరించేలా జాగ్రత్తలు పాటించారు. కోవిడ్‌ బాధితుల కోసం ప్రత్యేక కేంద్రాల్లో ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేశారు. 


Also Read: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!


తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్


తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు అక్టోబ‌ర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసిందే. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ  చేపట్టింది. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.


Also Read: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. తేదీలు, పూర్తి వివరాలివే 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి