టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష ఓ ప్రహసనం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అరలీటరు నీటితో 36 గంటల దీక్ష సాధ్యమేనా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారో కూడా టీడీపీ రాష్ట్ర అచ్చెన్నాయుడికి తెలియదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 36 గంటల దీక్ష ఎందుకో కూడా టీడీపీ నేతలకే తెలియదంటూ సజ్జల విమర్శించారు. దీక్షల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతుందని సజ్జల ఆరోపించారు. దీక్షలో టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారన్నారు. చేసేది దీక్ష మాట్లాడేది బూతులు అంటూ సజ్జల చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి బూతులను సమర్థిస్తున్నారా అని సజ్జల ప్రశ్నించారు. పట్టాభితో చంద్రబాబు తిట్టించారని ఆరోపించారు. 72 గంటలు ఆహారం తీసుకోని వ్యక్తి గంటకు పైగా మాట్లాడగలరా అని సజ్జల ప్రశ్నించారు. 



Also Read:  చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !


బూతులు సమర్థిస్తూ దీక్షలు


చంద్రబాబు చేసిన దీక్ష ద్వారా ఏం సాధించారని సజ్జల ఎద్దేవా చేశారు. గాంధేయవాదం పేరుతో చంద్రబాబు బూతులు మాట్లాడారని, బూతులు మాట్లాడటం హక్కు అన్నట్టుగా వ్యవహరించారని సజ్జల మండిపడ్డారు. బూతులను సమర్థిస్తూ ఎవరైనా దీక్షలు చేస్తారా? అని ప్రశ్నించారు. 36 గంటల దీక్ష ఎందుకో టీడీపీ నేతలకే అర్థం కావడం లేదన్నారు. పట్టాభి వాడిన పదానికి టీడీపీ కొత్త అర్థం చెబుతోందని విమర్శించారు. చంద్రబాబు తన దిల్లీ పర్యటనలో ఈ పదప్రయోగం చేస్తారా అని సజ్జల ప్రశ్నించారు.  


Also Read: చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్


చంద్రబాబు ఈ పదంతో పలకరిస్తారా...?


పట్టాభితో బూతులు మాట్లాడించింది చంద్రబాబే అని సజ్జల ఆరోపించారు. ఇలానే ఉంటే పరిస్థితులు మరింత దిగజారుతాయన్నారు. చంద్రబాబు దిల్లీకి వెళ్లి ఇలానే మాట్లాడుతారా అని సజ్జల ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు దిల్లీలో ఇదే పదంతో పలకరిస్తారా అని సవాల్ చేశారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో గంజాయి దందా జరిగిందన్నారు. మాదక ద్రవ్యాలపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని సజ్జల పేర్కొన్నారు. అక్రమ మద్యాన్ని నివారించేందుకు ఎస్ఈబీని నియమించామని సజ్జల అన్నారు. టీడీపీ అంతా చేసి అన్యాయం జరిగిందనడం రాద్దాంతం చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్వేషం సృష్టించేందుకు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారని, ఇదంతా టీడీపీ ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు.


Also Read: వైఎస్ఆర్సీపీ ఉగ్రదాడి చేసింది... పోలీసులు దగ్గరుండి మరీ దాడి చేయించారు... వైసీపీపై చంద్రబాబు ఫైర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి