టీ20 వరల్డ్‌కప్ ప్రధాన మ్యాచ్‌లు రేపటి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే 2022లోనే ఆస్ట్రేలియాలో మరో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. దీనికి సంబంధించిన క్వాలిఫయర్ మ్యాచ్‌లు దోహాలో జరగనున్నాయి. ఆసియా ఏ క్వాలిఫయర్‌లో మొత్తంగా ఐదు జట్లు తలపడనున్నాయి.


మ్యాచ్‌లకు ఆతిథ్యం వహిస్తున్న ఖతార్, బహ్రెయిన్, కువైట్, మాల్దీవ్స్, సౌదీ అరేబియా జట్లు ఈ క్వాలిఫయర్‌లో తలపడనున్నాయి. వీటిలో ఒక జట్టు మాత్రమే గ్లోబల్ క్వాలిఫయర్‌కు ఎంపిక కానుంది. ఒక ఐసీసీ ఈవెంట్ దోహాలో జరగడం ఇదే మొదటిసారి. ఏసియన్ టౌన్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.


‘ఇది చాలా గొప్ప ఫీలింగ్. ఈ ఈవెంట్ నిర్వహించడానికి మేం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. ఇది చాలా పెద్ద టోర్నమెంట్ అని తెలుసు. ఇటువంటి దశలో మేం గతంలో కూడా ఉన్నాం. గతంలో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో మాకంటే ర్యాంకింగ్స్‌లో ఎంతో ముందున్న జట్లను మేం ఓడించాం. అయితే ఒక్క పొరపాటు కారణంగా గ్లోబల్ క్వాలిఫయర్స్‌కు చేరుకోలేకపోయాం’ అని ఖతార్ కెప్టెన్ ఇక్బాల్ హుస్సేన్ చౌదరి ప్రకటనలో తెలిపారు.


ర్యాంకింగ్స్‌లో అన్ని జట్ల కంటే టాప్‌గా ఖతార్(21) ఈ టోర్నీలో అడుగు పెడుతోంది. కువైట్(27), సౌదీ అరేబియా (28), బహ్రెయిన్ (43), మాల్దీవ్స్ (74) గ్లోబల్ క్వాలిఫయర్‌కు ఎంపిక అవ్వడం కోసం పోటీ పడనున్నాయి. ఈ క్వాలిఫయర్స్‌లో అన్ని జట్లూ కలిపి 10 మ్యాచ్‌లు ఆడనున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.






Also Read: పాక్‌కు చుక్కలు చూపించే భారత ఆటగాడు అతడే.. మాథ్యూ హెడేన్‌ అంచనా


Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్‌ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!


Also Read: ఐపీఎల్‌ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్‌ యునైటెడ్‌' ఆసక్తి!


Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి