టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా  ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ముగిసింది. ఈ దీక్షలో మాట్లాడిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌పై దాడి చేశారన్నారు. ఎన్టీఆర్‌ భవన్‌లో 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఉన్నాయన్నారు. సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం సమీపంలోనే దాడి జరిగిందని ఆరోపించారు. ఏపీలో రూ.లక్ష కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయన్న చంద్రబాబు... విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. టీడీపీ హయాంలో మద్యం నియంత్రణ పారదర్శకంగా జరిగిందన్నారు. పట్టాభి మాటలను వక్రీకరించారన్నారు. కల్తీ మద్యంతో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తుందన్నారు.  



Also Read: అందులో గవర్నర్ పేరు ఎందుకు వాడారు? పూర్తి బాధ్యత ఎవరిది? సర్కార్‌కు ఏపీ హైకోర్టు ప్రశ్న


పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు


టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపడుచుల తాళిబొట్లు తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చారని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న లోకేశ్ పై సెక్షన్ 307 కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు ఖాకీ దుస్తులు ఇస్తే తామే ఇన్వెస్టిగేషన్ చేస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలీసులు దగ్గరుండి మరీ టీడీపీ ఆఫీస్‌పై దాడి చేయించారని ఆరోపించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రత్యర్థులు ఎంత రొచ్చగొట్టినా సంయమనం పాటించానన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిలో ఒక్కరి కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయాలేదని ఆరోపించారు. 






Also Read:  చంద్రబాబు వస్తే బాంబులేస్తామని వైఎస్ఆర్‌సీపీ నేత హెచ్చరిక.. కుప్పంలో ఉద్రిక్తత !


ప్రభుత్వ తప్పులు ప్రశ్నిస్తే దాడులు


వైఎస్ఆర్సీపీ ఉగ్రదాడి చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి సీఎంను ఎవ్వరూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు తప్పులు చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు సూచించారు. టీడీపీ ఆఫీసుకు వంద గజాల దూరంలోనే డీజీపీ ఆఫీసు ఉన్నా పోలీసులు స్పందించలేదన్నారు. దాడులను నియంత్రించడంలో డీజీపీ ఫెయిలయ్యారన్ని చంద్రబాబు ఆరోపించారు. పట్టాభిరామ్ విమర్శలను వక్రీకరించారని తెలిపారు. డ్రగ్స్‌పై ఏపీ సీఎంకు సమీక్ష చేసే తీరిక లేదాని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తప్పులపై ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీపై దాడి వ్యవహారంలో ఒక్కరినీ కూడా అరెస్ట్ చేయలేదన్నారు. 


Also Read: చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి