ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు బెయిల్ మంజూరు అయింది. శుక్రవారమే పట్టాభి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సీఆర్‌పిసి సెక్షన్‌ 41 కింద పోలీసులు ఇచ్చిన నోటీసు అంశంపై మేజిస్ట్రేట్‌ సంతృప్తి వ్యక్తం చేయకపోయినప్పటికీ పట్టాభిని రిమాండ్‌కు పంపారు. సిఆర్‌పిసి సెక్షన్‌ 41 ప్రకారం నడుచుకున్నామంటూ పోలీసులు సమర్పించిన పత్రంలో పలు ఖాళీలు ఉండటంపై మెజిస్ట్రేట్‌ అభ్యంతరం చెప్పారు. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని పట్టాభి తరపు న్యాయవాది కోరినప్పటికీ రిమాండ్‌కు పంపారు. ఈ అంశంపై హైకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిమాండ్ రిపోర్టుపై సంతృప్తి చెందనప్పటికీ ఎలా రిమాండ్‌కు పంపుతారనని.. పూర్తి వివరాలు సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు రికార్డులను పీపీ సమర్పించారు.  


Also Read : పరిటాల సునీతకు వల్లభనేని వంశీ ఓపెన్ ఛాలెంజ్... అలా చేస్తే రాజీనామా చేసేందుకు సిద్ధం...!


రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని.. అరెస్టులో సరైన విధానాలు పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిపై వ్యక్తిగత దూషణలకు పట్టాభి దిగారని.. అందుకే విధ్వంసకాండ చోటు చేసుకుందని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అయితే వ్యక్తులను బట్టి అరెస్టులు, పద్దతులు ఉండవని.. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని.. ఇక్కడ పోలీసులు ఆలాంటిదేమీ చేయలేదని పట్టాభి తరపు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదించారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి పట్టాభికి బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. 


 Also Read: దిల్లీ టూర్ లో ఈ పదంతోనే పలకరిస్తారా?... చేసేది దీక్షలు మాట్లాడేది బూతులు... చంద్రబాబుపై సజ్జల ఆగ్రహం


గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబుకు నర్సీపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలా నోటీసులు ఇవ్వడంపై పట్టాభి టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేశారు. అయితే ఆయన బూతులు తిట్టారంటూ సాయంత్రానికి పట్టాభి ఇంటితో పాటు టీడీపీ కార్యాలయంపైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు చేసి విధ్వంసానికి దిగారు. అయితే సీఎంను దూషించడం వల్లే ఇదంతా జరిగిందంటూ పట్టాభినే అరెస్ట్ చేశారు. 


Also Read: చంద్రబాబు ఢిల్లీ టూర్‌ బీజేపీకి దగ్గరవడానికా ? ఏపీలో రాజకీయాలు మారుతున్నాయా ?


మరో వైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దర్యాప్తులో భాగంగా 10 మందిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. పానుగంటి చైతన్య, పల్లపు మహేష్ బాబు, పేరూరి అజయ్, శేషగిరి పవన్‌కుమార్, అడపాల గణపతి,  షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్, లంక అభినాయుడుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్‌ కోసం టీడీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. మరో వైపు పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిలో పదకొండు మందిని గుర్తించి కేసులు పెట్టారు. 


Also Read: చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే చాలు... మేమేంటో వైసీపీకి చూపిస్తాం... పరిటాల సునీత సంచలన కామెంట్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి