ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 గంటల్లో 31,473 మంది నమూనాలు పరీక్షించారు. 222 కొత్త కేసులు నమోదవ్వగా.. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. కొత్తగా కొవిడ్ నుంచి 275 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,560 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో చెప్పింది. 


ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లు నిన్న కొవిడ్‌ సోకింది. ఇటీవల దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్‌ రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడ్డారు. గవర్నర్‌ దంపతులకు ఈ నెల 15న ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైంది. హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)కి వారిని తరలించాలని రాజ్‌భవన్‌ మంగళవారమే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.


అది కుదరకపోవడంతో రాజ్‌భవన్‌ వర్గాలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాయి. వారు బుధవారం హుటాహుటిన సైనిక విమానాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పంపారు. ప్రత్యేక విమానంలో గవర్నర్‌ దంపతులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీకి అంబులెన్సులో వెళ్లారు.


దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగింది. తాజాగా 11,919 మందికి కొవిడ్​ పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి​ ధాటికి మరో 470 మంది మరణించారు. తాజాగా 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు.


మొత్తం కేసులు: 3,44,78,517
‬మొత్తం మరణాలు: 4,64,623
‬యాక్టివ్​ కేసులు: 1,28,762
కోలుకున్నవారు: 3,38,85,132


Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!


Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్


Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు


Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..


Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!


Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!


Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి