By: ABP Desam | Updated at : 04 Dec 2021 08:01 PM (IST)
ఇండియన్ ఆర్మీను వదులుకొని.. 'అఖండ'లో విలన్ గా..
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటిరోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లో కూడా 'అఖండ' భారీ విజయాన్ని అందుకుంది. రెండు రోజుల్లో ఈ సినిమాకి రూ.50 కోట్ల షేర్ వచ్చినట్లు సమాచారం. అమెరికాలో అయితే ప్రీమియర్ షో కలెక్షన్స్ తో రికార్డులు బద్దలు కొట్టింది.
బోయపాటి డైరెక్షన్ తో పాటు.. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి బాక్సులు బద్దలయ్యాయి. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ తో పాటు మరో నటుడు నితిన్ మెహతా కూడా కనిపించారు. స్వామిజీ గెటప్ లో క్రూరమైన పనులు చేసే క్యారెక్టర్ అది. ఆ పాత్రకు నితిన్ మెహతా పూర్తి న్యాయం చేశారు. అయితే ఈయనొక ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మీకు తెలుసా..?
నిజమేనండీ.. నితిన్ మెహతా 21 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీలో సేవలు అందించారు. ఆ తరువాత ఒక ప్రొఫెషనల్ మోడల్ గా, నటుడిగా మారాలని కలలు కని.. తన యూనిఫామ్ ను తీసి పక్కన పెట్టారు. బాలీవుడ్ లో 'కాబిల్', 'భూమి' వంటి సినిమాల్లో నటించారాయన. సౌత్ లో కూడా రెండు, మూడు సినిమాల్లో నటించారు. కానీ ఏదీ సరైన గుర్తింపును తీసుకురాలేకపోయింది. అయితే 'అఖండ' మాత్రం అతడికి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాతో హాట్ టాపిక్ గా మారారు నితిన్ మెహతా. అతడికి విలన్ గా మరిన్ని అవకాశాలు రావడం ఖాయం!
Also Read: బాలయ్య షోలో మహేష్ బాబు.. ఫ్యాన్స్ వెయిటింగ్..
Also Read:పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: కత్రినా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Eesha Box Office Collections Day 2 : ఆడియన్స్‌ను భయపెడుతోన్న 'ఈషా' - రెండు రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
Shambhala Box Office Collection Day 2: రెండో రోజూ స్టడీగా 'శంబాల'... ఐదు కోట్ల క్లబ్బులో ఆది సాయికుమార్ సినిమా
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Mega Victory Mass Song Promo: 'మెగా విక్టరీ మాస్' సాంగ్ ప్రోమో వచ్చేసింది... చిరు & వెంకీ స్టైల్ అదిరిందిగా
HAQ Movie OTT : ఓటీటీలో 'OG' విలన్ కోర్ట్ రూమ్ డ్రామా 'హక్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్