Tandur: ఫిర్యాదు చేస్తే చెప్పుతో కొడతా.. మున్సిపల్ ఛైర్ పర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Continues below advertisement

పేరు ఒకటే కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తోటికోడలి ఓటు వేశారని ఆరోపణలు ఎదుర్కొన్న వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ ఛైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. స్వప్న భర్త తాటికొండ పరిమల్ గుప్తా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పట్టణంలోని 13వ వార్డుకు వెళ్లిన ఛైర్ పర్సన్ స్వప్న.. తమపై ఫిర్యాదు చేసిన పేదలు, బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం కోల్పోయిన ఆమె.. మాపైనే ఫిర్యాదు చేస్తారా.. మిమ్మల్ని చెప్పుతో కొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పేదలను చెప్పుతో కొడతానని ఆమె చేసిన వ్యాఖ్యలను స్థానిక కౌన్సిలర్, కాంగ్రెస్ నేత వరాల శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram