Mahabubnagar News: ఈ వాగు దాటాలంటే సాహసం అనే చెప్పాలి

Continues below advertisement

Road Damage Due To Heavy Rains in Mahabub Nagar News: తగ్గినట్టే తగ్గి మళ్లీ దంచి కొడుతున్నాయి (Telangana Rains) వర్షాలు. ఎప్పటిలాగే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల అయితే.. ఏకంగా రోడ్లు తెగిపోయేంత స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు, మహబూబ్‌ నగర్‌కి (Mahabub Nagar) వెళ్లే దారిలోవి. ఆ మధ్య భారీ వర్షాలు (Mahabub Nagar Heavy Rains) కురిసి అంతా ధ్వంసమైంది. వెంటనే అధికారులు రిపేర్ చేశారు. అలా మరమ్మతులు పూర్తయ్యాయో లేదో.. వెంటనే మరోసారి భారీ వానలు కురుస్తున్నాయి. ఫలితంగా మళ్లీ రోడ్డు (Mahabub Nagar Roads) ధ్వంసమైంది. కొందుర్గు, మహబూబ్‌నగర్ (Mahabub Nagar) మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వెంకిర్యాల గ్రామంలో వాగు ఉద్ధృతికి ఇటీవల వేసిన పైపులు కొట్టుకుపోయాయి. ఈ దారిలో వెళ్లేందుకు వాహనదారులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.    

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram