Harsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీ

Continues below advertisement

Harsha Sai News: కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ వార్తల్లో ఉండగానే.. ఇప్పుడు ఒక యూట్యూబ్ సెలబ్రిటీ అలాంటి కేసులో చిక్కుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదు అయింది. న్యూడ్ ఫొటోస్, వీడియోస్‌తో తనను హర్షసాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఓ యువతి హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హర్ష సాయిపై 376(2), 376N, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేసినట్టుగా రాజేంద్రనగర్ డీసీపీ తెలిపారు.

అయితే, ప్రస్తుతం హర్ష సాయి మెగా అనే సినిమా తీస్తుండగా.. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా ఉన్నట్లు తెలిసింది. ఆ సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి పట్టుబడడంం కారణంగానే ఈ వివాదం చెలరేగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం హర్షసాయితో పాటు ఆయన తండ్రి రాధాక్రిష్ణ కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం. అయితే, హర్ష సాయి తన ఇస్టాలో దీనిపై స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారం అంతా తప్పుడు ఆరోపణలని వివరణ ఇచ్చారు. ఇదంతా తననుంచి డబ్బు కాజేయడానికి ఆడుతున్న నాటకం అని చెప్పారు. మీకు నాగురించి తెలుసు. నిజమేంటో త్వరలోనే తెలుస్తుందని ఇన్ స్టా స్టోరీ పెట్టారు. తన అడ్వకేట్ తానికొండ చిరంజీవి దీనిపై స్పందిస్తారని హర్ష సాయి ఇన్ స్టా స్టోరీ పెట్టారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram