నిజామాబాద్ అంకాపూర్ గ్రామం దేశానికే ఆదర్శం

Continues below advertisement

పేరుకు ఊరే అయినా అక్కడ కనిపించే భవనాలు చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామం పేరువినగానే అందరికీ గుర్తొచ్చేది పసుపు పంట, దేశీ చికెన్.నిజామాబాద్ నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 63 అనుకుని ఉంటుంది అంకాపూర్. వ్యవసాయంలో కొత్త వంగడాలు సృష్టించటం, వాణిజ్యపంటలతో సిరులు కురిపించే గ్రామం ఇది. ఇక్కడ భవంతులు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే... ఈ గ్రామంలో దాదాపు 10 వేల జనాభా ఉంటుంది. 500 లకు పైగా ఇళ్లుంటాయ్. అయితే వ్యవసాయంలో మంచి లాభాలు ఆర్జించే అంకాపూర్ రైతులు తాము ఉండే ఇళ్లను సైతం అందంగా కట్టించుకుంటారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram