ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రోజుకు ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు రాత్రిపూట పడిపోయి అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కుమ్రం బీమ్ జిల్లా గిన్నేదరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీలు నమోదు అయ్యాయి.ఆదిలాబాద్ జిల్లా బెలలో 3.8 డిగ్రీలు,బీమ్ పూర్ మండంలో అర్లీటీ 3.8 డిగ్రీలు నమోదయ్యాయి.. వీటితో పాటు మరోక పదిమండలాల్లో ఐదు డిగ్రీల కన్న అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో పెరుగుతున్న చలితో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.