Watch: హుజూరాబాద్‌లో రూ.10కి 10 గారెలు.. వేరే రాష్ట్రాల్లోనూ ఈ సెంటర్ ఎంతో ఫేమస్
Continues below advertisement
చెల్‌పూర్ చిన్న గారెల సెంటర్ హుజూరాబాద్ ప్రాంతంలో ఎంతో స్పెషల్. హుజురాబాద్ ఎవరు వచ్చినా ఈ గారెలు తినాల్సిందే. ‘‘మాది చెల్ పూర్ గ్రామం. హుజూరాబాద్‌కు 7 కి.మి. దూరం. మానాన్న గన్ను మధుసూదన్ ఈ దుకాణం ప్రారంభించారు. చెల్ పూర్ గ్రామంలో 60 సంవత్సరాలుగా ఇదే బిజినెస్ నడుపుతున్నాం. హుజూరాబాద్ వచ్చి 5 సంవత్సరాలు అయింది. హుజూరాబాద్ ప్రజల కోరిక మేరకు ఇక్కడికి వచ్చాం. బొబ్బర పప్పు, మినపప్పుతో గారెల పిండి చేస్తాం. దీంట్లో కొత్తిమీర, పుదీన, మెంతి ఆకులు వేస్తాం. చెట్నీ మాదగ్గర స్పెషల్. మిరపకాయలను ఎండబెట్టి.. దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు, శొంఠి, మిరియాలు, ఎండబెడ్డి వెల్లిపాయ పేస్టు కలుపుతాం.’’ అని నిర్వహకులు వివరించారు.
Continues below advertisement