Hyderabad Rains: వామ్మో ఇదేం హైదరాబాద్..? చుక్కలు చూపించిన వర్షం
Continues below advertisement
హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం మరోసారి ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం కొన్ని గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, సోమాజీగూడ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, కోఠి సహా మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలాశయాలుగా మారిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తింది. నగరవాసులు పండుగ పూట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Continues below advertisement