శిధిలమవుతున్న రెండో శతాబ్థం నాటి బౌద్ద గుహలు.. ఎక్కడంటే?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారుకొండ గ్రామంలోని కారుకొండ గుట్టలో ఉన్న చారిత్రక ఆనవాళ్లు శిథిలం అవుతున్నాయి. రెండో శతాబ్ధంలో కొందరు బౌద్ద బిక్షువులు ఇక్కడ గుహలు ఏర్పాటు చేసుకొని అక్కడే ద్యానం చేసేవారని స్థానికులు అంటున్నారు. 1960లో ఈ చారిత్రక ఆనవాళ్లను పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. దీనిని చారిత్రక ప్రదేశంగా గుర్తించి ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. గత ఐదేళ్ల క్రితం పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ ఉన్న గుహలను, చారిత్రక ఆనవాళ్లను రక్షించేందుకు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అయితే పర్యవేక్షణ లేకపోవడం వల్ల చరిత్ర చెప్పిన ఆనవాళ్లు శిధిలమవుతున్నాయి.
Tags :
Bhadradri Karukonda Historical Buddhisht Caves Historical Buddhisht Caves Karukonda Buddhisht Caves