Hyderabad News: సైదాబాద్ ఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం శోచనీయం : ఎమ్మెల్యే సీతక్క

Continues below advertisement

చిన్నారిపై అత్యాచారం, హత్యపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం గమనార్హమని ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత సీతక్క ఆరోపించారు. సోమవారం ఆమె చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. గణేశ్ చతుర్థి రోజు నగర నడిబొడ్డున చిన్నారిపై దారుణం జరిగితే సీఎం కేసీఆర్, కేటీఆర్ స్పందించలేదని విమర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై అనుమానాలకు తావిస్తోందన్నారు. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు  తెలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్   స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన బిడ్డకి అన్యాయం జరిగితే కనీసం గిరిజన ఎమ్మెల్యేలు మాట్లాడకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని సీతక్క అన్నారు.  కేవలం కలెక్టర్ ను పంపి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. దుర్మార్గానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సినీ యాక్టర్ బైక్ యాక్సిడెంట్ కు ఇచ్చిన కవరేజ్, చిన్నారి ఘటనకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram