Harish Rao Dance: స్టెప్పులేసిన మంత్రి హరీశన్న.. కండువా ఊపుతూ ఉత్సాహంగా..

కమలాపూర్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం సందర్భంగా కళాకారుల ధూమ్‌ ధామ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా’ అనే పాటకు మంత్రి హరీశ్‌ రావు డాన్సు చేశారు. గులాబీ జెండా ఊపుతూ ఎదురుగా ఉన్న కార్యకర్తలను ఉత్సాహపర్చారు. ఎమ్మెల్యే బాల్క సుమన్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ నాయకుడు పాడి కౌశిక్‌ రెడ్డి కూడా హరీశ్ రావుతో డ్యాన్స్‌ చేసిన వారిలో ఉన్నారు. కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉన్న ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola