Watch: రేప్ ఘటనపై ఆలోచింపజేస్తున్న సైకత శిల్పం
తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పం ఆకర్షిస్తుంది. ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత దీన్ని రూపొందించారు. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా సైకత శిల్పం ఏర్పాటు చేశారు. పసలేని చట్టాలే మాకు శాపాలు.. ఆడపిల్లగా పుట్టడమే పాపమా..? అనే నినాదాలతో సైకత శిల్పం ఉంది. దోషిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వారు ఈ వినూత్న నిరసన చేశారు.