Luxury Cars Seized: పన్ను ఎగ్గొట్టి చక్కర్లు... చిక్కుల్లో లగ్జరీ కార్ల ఓనర్లు
పన్ను ఎగ్గొట్టి జల్సాగా షికార్లు కొడుతున్న హై ఎండ్ లగ్జరీ కార్లను హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఆర్టీఏ అధికారులు ఆదివారం ఆకస్మిక దాడులు చేసి 11 వాహనాలను సీజ్ చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కె.పాపారావు, మోటారు వాహన తనిఖీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్ అయిన లగ్జరీ కార్లపై పన్ను చెల్లించకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 కార్లను సీజ్ చేశారు. జఫ్తు చేసిన వాహనాల నుంచి జీవితకాల పన్ను రూపంలో రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్లు వసూలు వేయనున్నారు. సీజ్ చేసిన వాటిలో మెర్సెడస్ బెంజ్, మాసరట్టి, పెర్రారి, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గీని వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.
Also Read: Chiranjeevi: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?