Bathukamma Sarees: ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు.. బతుకమ్మ చీరలపై వివాదం
Continues below advertisement
వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లిలో బతుకమ్మ పండగ సందర్భంగా అక్కడి ఎంపీపీ మౌనిక మహిళలకు చీరల పంపిణీలో పాల్గొన్నారు. ఆ చీరలు బాగోలేవని, తమకు చెప్పిన తీరుగా చీరల పంపిణీ జరగడం లేదని అక్కడి మహిళలు ఎంపీపీని నిలదీశారు. ఇచ్చేది ఇవే చీరలు.. మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అంటూ సమాధానం ఇచ్చారు. ఎంపీపీ ఆ మాట అనేసరికి మహిళలు చీరలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. ఈ వీడియొ సామాజిక మాద్యమాలలో వైరల్ అవుతోంది.
Continues below advertisement