T20 World Cup 2024 Qualification Scenarios - ఇంటికెళ్లే ప్రమాదంలో అగ్రజట్లు

Continues below advertisement

వెస్టిండీస్, యూఎస్ఏల్లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో సూపర్-8 దశకు చేరుతుంది. అయితే ఈ ప్రపంచకప్ ఫలితాలు క్రికెట్ ఫ్యాన్స్‌కు షాకిచ్చేలా సాగుతున్నాయి. ఒక్కో గ్రూపుల్లో రెండేసి చొప్పున మొత్తం నాలుగు గ్రూపుల్లో ఎనిమిది టాప్ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎనిమిది టీమ్స్‌లో నాలుగు జట్లు ఇంటి బాట పట్టేలా కనిపిస్తున్నాయి. ఏ గ్రూపులో పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ఈ గ్రూపులో భారత్, పాకిస్తాన్, యూఎస్ఏ, కెనడా, ఐర్లాండ్ ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో భారత్ సూపర్-8కు చేరుకుంది. కానీ పాకిస్తాన్‌పై యూఎస్ఏ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదంలో పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో యూఎస్ఏనే సెకండ్ ప్లేస్‌లో ఉంది. సూపర్-8కు వెళ్లాలంటే రెండు జట్లకు చివరి మ్యాచ్ చాలా కీలకం.

గ్రూప్-బి: ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్ ఉన్నాయి. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆస్ట్రేలియా సూపర్-8కు చేరుకుంది. కానీ ఇంగ్లండ్, స్కాట్లాండ్ మ్యాచ్ అనూహ్యంగా వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇదే ఇంగ్లండ్ కొంపముంచేలా ఉంది.  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో స్కాట్లాండ్‌నే సెకండ్ ప్లేస్‌లో ఉంది. స్కాట్లాండ్ నెట్ రన్‌రేట్ కూడా బాగుంది. ఇంగ్లండ్ రెండు మ్యాచ్‌లూ గెలిచినా స్కాట్లాండ్ పాయింట్లను దాటలేదు. కాబట్టి ఇంగ్లండ్ ముందుకు వెళ్లాలంటే అద్భుతాలు జరగాల్సిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram