Virat Kohli - కొనసాగుతున్న విరాట్ పేలవ బ్యాటింగ్

Continues below advertisement

ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి ముందు వరకు టీమిండియాలో ఏ ప్లేయర్ మీదనైనా హయ్యస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయా అంటే అది కోహ్లీ మీదనే. ఐపీఎల్‌లో అద్భుతమైన ఫామ్, ఐసీసీ టోర్నమెంట్లలో సూపర్ రికార్డు రెండూ కలిసి కింగ్‌పై అంచనాలు పెట్టుకునేలా చేశాయి. కానీ ఈ టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ పూర్తిగా నిరాశపరిచాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు.

బ్యాటింగ్ పొజిషన్ మారడం విరాట్ కోహ్లీపై ఎఫెక్ట్ చూపించిందని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి ఓపెనింగ్ కొత్తేమీ కాదు. ఐపీఎల్‌లో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ రెగ్యులర్ ఓపెనర్‌గా ఉన్నాడు. యూఎస్ పిచ్‌లు బౌలింగ్‌కు అనుకున్న మాట వాస్తవమే కానీ కోహ్లీ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ వరుస ఫెయిల్యూర్లకి పిచ్‌ను కారణంగా చూపడం కూడా బాగోదు.

టీ20 వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 28 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 24 ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. ఈ 24 ఇన్నింగ్స్‌లో ఒక్కసారి మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరుకు అవుట్ అయ్యాడు. కానీ వేరే పొజిషన్లలో ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ వరుసగా నాలుగు సార్లు సింగిల్ డిజిట్‌కే అవుట్ అవ్వడం ఇదే మొదటి సారి. వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ మూడిట్లోనూ డకౌట్ అయిన రెండో ఇండియన్ బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. విరాట్ కంటే ముందు మొదటిగా తన తోటి స్టార్ ప్లేయర్ రోహిత్ ఈ లిస్ట్‌కు ఎక్కేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram