5 Runs Penalty For USA What is Stop Clock | స్టాప్ క్లాక్ రూల్ అంటే ఏంటి?
బుధవారం రాత్రి యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్‌లో 15 ఓవర్లు ముగిసిన తర్వాత ఐదు పరుగులను భారత్ ఖాతాలో యాడ్ చేశారు. అలా ఎందుకు చేశారో తెలుసా? దీనికి రీజన్ తెలియాలంటే ముందు మీరు స్టాప్ క్లాక్ రూల్ గురించి తెలుసుకోవాలి.
స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం ఫీల్డింగ్ చేసే జట్టు ఓవర్ ముగిశాక 60 సెకన్లలోపే మరో ఓవర్‌ను ప్రారంభించాలి. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ టైమర్‌ను కూడా ఫీల్డ్‌లో డిస్‌ప్లే చేస్తారు. ఒకవేళ ఫీల్డింగ్ టీమ్ రెండు సార్లు ఆలస్యం చేస్తే వార్నింగ్ ఇస్తారు. మూడో సారి నుంచి ఐదు పరుగుల పెనాల్టీ పడుతుంది.
ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ మూడు సార్లు కొత్త ఓవర్ ప్రారంభించడానికి 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంది. ఈ కారణంగా భారత్‌కు ఐదు పరుగులు అదనంగా లభించాయి. ఈ పెనాల్టీ టీమిండియాపై పెద్ద ప్రభావం చూపించలేదు. కానీ ఇటువంటి లో స్కోరింగ్ మ్యాచ్‌ల్లో జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి చిన్న తప్పులు పీకల మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం భారత జట్టు సూపర్-8కు చేరుకుంది. రెండో బెర్త్ కోసం యూఎస్‌ఏ, పాకిస్తాన్... రేసులో ఉన్నాయి.