Swapnil Kusale bronze Medal Paris Olympics 2024 | తలా ఫర్ ఏ రీజన్ అంటున్న ఒలింపిక్ విజేత | ABP Desam
ఒలింపిక్ లో భారత్ కు మూడో పతకాన్ని సాధించి పెట్టిన ఈయన పేరు స్వప్నిల్ కుశాలే. షూటింగ్ లో 50మీటర్ల 3పొజిషన్ లో ఈవెంట్ లో స్వప్నిల్ మూడోస్థానంలో నిలవటం ద్వారా కాంస్యపతకాన్ని స్వప్నిల్ కుశాలే కైవసం చేసుకున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో కంబల్వాడీ అనే గ్రామం నుంచి వచ్చిన 29ఏళ్ల స్వప్నిల్ సింగ్ ది అచ్చం మహేంద్ర సింగ్ ధోని లాంటి స్టోరీనే.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం సాధించాడు. కానీ చిన్నప్పటి నుంచి షూటింగ్ మీద ఉన్న ప్రేమతో ఉద్యోగం వచ్చినా దాన్ని కొనసాగించాడు. ఫలితంగా ఒలింపిక్స్ కి అర్హత సాధించి వెళ్లి ఆడటంతో పాటు ఏకంగా కాంస్య పతకం గెలిచి దేశ గౌరవాన్ని నిలబెట్టాడు. స్వప్నిల్ ను గెలిచిన తర్వాత మీకు ప్రేరణ ఎవ్వరు అని అడిగితే ధోని పేరు చెప్పాడు. టికెట్ కలెక్టర్ నుంచి క్రికెటర్ గా మారి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని తనకు ఐడల్ అని... ధోని బయోపిక్ ను చూసి ఇప్పటికీ స్ఫూర్తి పొందుతానని చెప్పాడు. స్వప్నిల్ కూడా అచ్చం ధోని లాగే టికెట్ కలెక్టర్ నుంచి షూటింగ్ వైపు మళ్లి ఇప్పుడు ఒలింపిక్ పతకం వరకూ ప్రయాణం సాగించటంతో ధోని ఇప్పుడు మరింత స్పెషల్ గా మారాడు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.