Yusuf Dikec Paris Olympics 2024 Shooting Medal | ఎవురయ్యా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు..! | ABP
ఒలింపిక్స్ కి అంత క్రేజ్ ఎందుకంటే కొన్ని అన్ బిలీవబుల్ టాలెంట్స్ ను చూసే అవకాశం దక్కుతుంది. అలాంటి టాలెంటెడ్ ప్లేయర్లను గమనించేందుకు ఇదొక్కటే విశ్వవేదిక. అలాంటి టాలెంటెడ్ ప్లేయరే నిన్నొకాయన ఒలింపిక్స్ లో కనిపించారు. ఒలింపిక్స్ ఆడటానికి మీకు రకరకాల సరంజామా కావాలేమో నేను మాత్రం హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకుని వచ్చేస్తా అన్నట్లు....ఎలా వచ్చామని కాదన్నాయా బుల్లెట్టు దిగిందా లేదా అన్నట్లు సినిమా హీరో మాదిరి సింపుల్ స్టైల్ అండ్ స్వాగ్ తో సిల్వర్ మెడల్ కొట్టుకుని వెళ్లిపోయాడు. ఆయన పేరే యూసుఫ్ డికెక్. టర్కీ దేశానికి చెందిన షూటర్ ఈయన. టర్కీ ఆర్మీలో సైనికుడిగా పనిచేసిన యూసుఫ్ వయస్సు 51 సంవత్సరాలు. 10మీటర్ల ఎయిర్ పిస్టర్ మిక్స్ డ్ ఈవెంట్ లో పాల్గొని రజత పతకం సాధించారు యూసుఫ్. ఎందుకింత ప్రత్యేకం అయ్యారంటే సాధారణంగా షూటర్లు చాలా సరంజామా తో వస్తారు. కళ్లకు టార్గెట్ కనిపించేలా లెన్స్ లు వాడతారు. బుల్లెట్స్ సౌండ్ వినపడకుండా దృష్టి మరలకుండా చెవులకు మంచి ఇయర్ ఫోన్స్ వాడతారు. హెడ్ సెట్స్, వైజర్ లు కాస్ట్ లీ కళ్లద్దాలు అబ్బో ఓ రేంజ్ లో ఉంటుంది హడావిడి. అలాంటిది ఈయనేదో రిటైర్డ్ హెడ్ మాస్టర్ లా జస్ట్ నార్మల్ కళ్లజోడు. చెవుల్లో రెండు ఇయర్ బడ్స్ అంతే. టీ షర్ట్ వేసుకుని ఓ ట్రాక్ ప్యాంట్ తో వచ్చేశాడు. ఓ చేత్తో గన్ పట్టుకుని మరో చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకుని ఏదో నీలోఫర్ కేఫ్ లో ఛాయ్ తాగటానికి వచ్చిన సీనియర్ సిటిజన్ లా చాలా కూల్ గా నింపాదిగా వచ్చేసి పతకం కొట్టుకుని వెళ్లిపోవటం క్రేజీ అసలు. అందుకే కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు ఉన్నట్లు ఈయన ఫోటో ఈ స్వాగ్ అండ్ స్టైల్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.