Mirabai Chanu Missed Medal in Paris Olympics | కాంస్య పతకం తృటిలో మిస్ చేసుకున్న మిరాబాయి చాను
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMirabai Chanu Missed Medal in Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ లో మరో పతకం చేతిదాక వచ్చి చేజారిపోయింది. 49కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను 4వ ప్లేస్ లో నిలిచారు. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై మీరాబాయి చాను ఓ వీడియో విడుదల చేశారు..! అందులో ఏం మాట్లాడారు అంటే..! " ఈ రోజు నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను. అందరికి తెలిసిందే ప్లేయర్స్ కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. నా ఫస్ట్ ఒలింపిక్స్ సమయంలో ఏం జరిగిందో అందరికి తెలుసు. ప్రతి ఒక్క ప్లేయర్ కు కొన్ని సార్లు అదృష్టం వరిస్తుంది. మరికొన్ని సార్లు వరించదు. నాకు ఈ సారి అదృష్టం వరించలేదు,చేతిదాక వచ్చిన మెడల్ చేజారిపోయింది. ఆ తరువాత నేను వరల్డ్ ఛాంపియన్ గా మారాను. టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి తొలిసారిగా సిల్వర్ మెడల్ అందించాను. అదే ఉత్సాహంతో ఈ సారి కూడా దేశానికి మెడల్ తీసుకురావాలని శాయశక్తుల ప్రయత్నించాను" అని మీరాబాయి అన్నారు.