India vs Sri Lanka 3rd ODI Match Highlights | 27 ఏళ్ల తరువాత శ్రీలంకపై వన్డే సిరీస్ ఓడిపోయిన భారత్

India vs Sri Lanka 3rd ODI Match Highlights | 

గడిచిన 27 ఏళ్లలో తొలిసారిగా శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయింది భారత్. అది కూడా గంభీర్ హయాంలో కావడం విశేషం. మూడో వన్డేలో శ్రీలంక 248 పరుగులు చేస్తే.. టీం ఇండియా 138 పరుగులకే ఆలౌట్ ఐంది. దీంతో..110 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. ఈ మూడు మ్యాచుల సిరీస్ లో భారత్ ఓడిపోయింది స్పిన్ ఎదుర్కోలేకే. యస్.. ఈ మాడు మ్యాచుల్లో భారత్ 3 వికెట్లు మాత్రమే పేసర్లుకు ఇచ్చింది. మిగతా 27 వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. దీనిని బట్టే చెప్పుకోవచ్చు మనోళ్ల ఆటతీరు ఎలా సాగిందో. ఇక్కడ మనోళ్లు ఓడిపోవడం కంటే ఓడిపోయిన తీరే బాధాకరం. ఎందుకంటే.. మార్చి నుంచి మొన్న జింబాబ్వే సిరీస్ వరకు మొత్తం టీ20 మ్యాచులే ఆడారు. సో.. ఇంకా ఆ టీ20 మత్తు నుంచి దిగలేదా అనిపిస్తోంది. టీ20ల్లో లాగా ఓ 15 బాల్స్ ఆడి 30-40 కొట్టిపాతానంటే వన్డేల్లో నడవదు కదా.! మరోవైపు ఈ ఓటమికి కోచ్ గంభీర్ కూడా ఓ కారణంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే.. గంభీర్ టీమ్ లో మార్పులు చాలా చేస్తున్నాడు. మ్యాచ్ మ్యాచ్ కే మార్పులు అంటే ఆటగాళ్ల సిద్ధమయ్యేది ఎలా..!

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola