Key Players For Pakistan in T20 World Cup| పాకిస్తాన్‌లో కీలక బ్యాటర్, బౌలర్, ఆల్‌రౌండర్
కేవలం పాకిస్తాన్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ బ్యాటర్లలో బాబర్ ఆజం ఒకడు. ప్రస్తుతం ఫాంలో కూడా ఉన్నాడు. ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్, పాకిస్తాన్ సిరీస్‌లో కూడా రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో 40కి పైగా యావరేజ్, 130కి పైగా స్ట్రైక్‌రేట్‌తో నాలుగు వేలకు పైగా పరుగులు బాబర్ ఆజం సాధించాడు. మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. 130 స్ట్రైక్ రేట్ అనేది మనకు అలవాటైన ఐపీఎల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 130 స్ట్రైక్ రేట్ తక్కువ అనిపించవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు దేశాల పిచ్‌లను పరిగణనలోకి తీసుకుంటే ఇది మంచి స్ట్రైక్‌రేటే. కాబట్టి భారత్ విజయం సాధించాలంటే బాబర్ పెవిలియన్‌కు చేరాల్సిందే. అలాగే ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు కీలక బ్యాటర్ బాబర్ ఆజంనే.
బౌలర్ - షహీన్ అఫ్రిది
పాకిస్తాన్ టీమ్‌లో ఉన్న బెస్ట్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిదినే. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో షహీన్ అఫ్రిది ఇప్పటివరకు 91 వికెట్లు తీసుకున్నాడు. తన ఎకానమీ 7.73 కాగా, యావరేజ్ 20.36గా ఉంది. ఇటీవలే జరిగిన ఇంగ్లండ్‌లో సిరీస్‌లో కూడా రాణించి మంచి ఫాంలో ఉన్నాడు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాపై మంచి ప్రదర్శన కనపరిచాడు. ఆ మ్యాచ్‌లో అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టాడు. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్ రాణించాలంటే షహీన్ అఫ్రిది కీలకం. దీంతో పాటు మిగతా పేసర్లు నసీం షా, హరీస్ రౌఫ్ అతనికి మంచి సహకారం అందించాలి.