Key Players For India in T20 World Cup | టీమిండియాలో కీలకమైన బ్యాటర్, బౌలర్, ఆల్‌రౌండర్
టీ20 ప్రపంచ కప్ కోసం భారతజట్టు యూఎస్‌ఏలో దిగింది. ప్రాక్టీస్ కూడా మొదలెట్టేసింది. ఏ టీమ్‌లో అయినా ఇతను కొడితే మంచి స్కోరు వస్తుంది అని ఫ్యాన్స్, క్రికెట్ అనలిస్టులు అంచనా వేసే బ్యాటర్ ఒకడుంటాడు. ఇతనికి బంతి సరిగ్గా పడితే ప్రత్యర్థి జట్టుకు చుక్కలే అనిపించే బౌలర్ ఒకడుంటాడు. అలాగే ఈ రెండూ నేను చేయగలను అనే ఆల్‌రౌండర్ ఒకరుంటారు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ఫ్యూచర్‌ను డిసైడ్ చేసే బ్యాటర్, బౌలర్, ఆల్‌రౌండర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
బ్యాటర్ - విరాట్ కోహ్లీ
ప్రస్తుతం ఉన్న మొత్తం జట్టులో అద్భుతమైన ఫాంలో ఉన్న బ్యాటర్. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో 150కి పైగా స్ట్రైక్‌రేట్, 60కి పైగా యావరేజ్‌తో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. గత సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా బీభత్సమైన ఫాంలో ఉన్నాడు. టీమ్‌లో తన రోల్ కూడా చాలా కీలకం. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి వరకూ క్రీజులో ఉండేలా ఆడాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. తనదైన రోజున విరాట్ ఎంతటి ప్రమాదకారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఫోర్లు, సిక్సర్లు మాత్రమే కాదు... అప్పుడే ఇంత స్కోరు వచ్చిందా అనిపించేలా సింగిల్స్, డబుల్స్ కూడా వేగంగా తీసే సామర్థ్యం తన సొంతం. కాబట్టి ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు విరాట్ కీలకం.
బౌలర్ - జస్‌ప్రీత్ బుమ్రా
బుమ్రా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే మేటి పేసర్లలో ఒకడు. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా బంతుల్లో వైవిధ్యంతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. అరికాళ్లను గురిపెట్టి వేసే యార్కర్ బుమ్రా స్పెషల్. బ్యాటర్లు వీర విజృంభణ చేసిన ఐపీఎల్ 2024 సీజన్‌లో కూడా బుమ్రా 6.48 ఎకానమీ మెయింటెయిన్ చేశాడు. ఈ సీజన్‌లో ఇది సెకండ్ హయ్యస్ట్ ఎకానమీ. కేవలం పరుగులు కట్టడి చేయడం మాత్రమే కాకుండా 20 వికెట్లు కూడా తీశాడు. తన ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి బుమ్రా సెట్ అయితే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఈ ప్రపంచకప్‌లో బౌలింగ్‌లో ఇండియా ట్రంప్ కార్డ్ బుమ్రానే.