టీమిండియా బౌలింగ్‌లో బుమ్రానే కీలకం

Continues below advertisement

బుమ్రా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే మేటి పేసర్లలో ఒకడు. పిచ్ నుంచి సహకారం లభించకపోయినా బంతుల్లో వైవిధ్యంతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. అరికాళ్లను గురిపెట్టి వేసే యార్కర్ బుమ్రా స్పెషల్. బ్యాటర్లు వీర విజృంభణ చేసిన ఐపీఎల్ 2024 సీజన్‌లో కూడా బుమ్రా 6.48 ఎకానమీ మెయింటెయిన్ చేశాడు. ఈ సీజన్‌లో ఇది సెకండ్ హయ్యస్ట్ ఎకానమీ. కేవలం పరుగులు కట్టడి చేయడం మాత్రమే కాకుండా 20 వికెట్లు కూడా తీశాడు. తన ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి బుమ్రా సెట్ అయితే ప్రత్యర్థి బ్యాటర్లకు కష్టాలు తప్పవు. ఈ ప్రపంచకప్‌లో బౌలింగ్‌లో ఇండియా ట్రంప్ కార్డ్ బుమ్రానే.

Continues below advertisement
Sponsored Links by Taboola