Ind vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samson

Continues below advertisement

 బాగా ఆకలిగా ఉన్న సింహాలకు జింక పిల్ల దొరికితే ఎలా ఉంటుంది అది కూడా గడ్డి కూడా లేని మైదానంలో. టీమిండియాకు అలా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్ పై ఆడటానికి బంగ్లా దేశ్ దొరికింది. అంతే మూడో టీ20లో పూనకాలెత్తిన భారత బ్యాటర్ల ధాటికి బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. యమా ఎగ్జైంటిగ్ గా జరిగిన మూడో టీ20లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.


1. సింహం లాంటి సంజూ :
 ఎన్నాళ్లుగానో తనలోని బీస్ట్ అన్ లీష్ చేయటానికి మాటు వేసి చూస్తున్న సంజూ శాంసన్ ఈ రోజు తన కసినంతా తీర్చేసుకున్నాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవటం మొదలు ఓపెనర్ సంజూ శాంసన్ బాదుడుకు హద్దే లేకుండా పోయింది. అభిషేక్ శర్మ త్వరగానే అవుటైనా సూర్య భాయ్ తో కలిసి సంజూ ఊచకోత కోశాడు. ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒకే ఓవర్ ఐదు సిక్సర్లంటూ అంతకంతకూ విరుచుకపడి ఏకంగా తన కెరీర్ లో తొలి టీ20 సెంచరీ బాదేశాడు. 47 బంతుల్లో 11ఫోర్లు 8 సిక్సర్లతో 111పరుగులు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన రెండో భారత బ్యాటర్ సంజూ శాంసనే.


2. సూర్య షో..పాండ్యా స్వాగ్
  సంజూ శాంసన్ ఆటతో సూర్యకుమార్ యాదవ్ హిట్టింగ్ ఓవర్ షాడో అయ్యింది కానీ..సూర్యా భాయ్ ఏ మాత్రం తగ్గలేదు. 35బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సులతో 75పరుగులు చేశాడు సూర్య. జస్ట్ లో సెంచరీ మిస్సయ్యాడు కానీ సూపర్బ్ ఇన్నింగ్స్. ఆ తర్వాత పరాగ్ తో కలిసి హార్దిక్ పాండ్యా తన స్వాగ్ చూపించాడు. పాండ్యా 18 బాల్స్ 47 పరుగులు చేస్తే..పరాగ్ 4సిక్సులతో 34పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297పరుగులు చేసింది.


3. వరల్డ్ రికార్డు జస్ట్ మిస్
 ఈ మ్యాచ్ లో సంజూ, సూర్య దూకుడు చూసినవాళ్లు ఫిక్స్ అయ్యింది ఒక్కటే. టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక స్కోరుగా ఉన్న 314పరుగులు బ్రేక్ అవుతుందా అని. మంగోలియా మీద నేపాల్ కొట్టిన స్కోరు రికార్డు జస్ట్ లో బతికిపోయింది కానీ టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో టీ20ల్లో ఓ జట్టు చేసిన అత్యధిక పరుగుల రికార్డును హైదరాబాద్ లో తన పేరు మీద రాసుకుంది టీమిండియా. నిజంగా మెమరబుల్ మ్యాచ్ ఇది.


4. పోరాడిన లిటన్, హృదయ్
  298పరుగుల టార్గెట్ అది కూడా టీమిండియా మీద అంటే దాదాపు అసాధ్యం. కానీ బంగ్లా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లిటన్ దాస్, తౌహిద్ హ్రిదోయ్ కాసేపు పోరాడారు. దాస్ 42పరుగులు చేస్తే..హ్రిదోయ్ 42 బాల్స్ లో 63పరుగులు చేశాడు కానీ ఆ పోరాటం సరిపోలేదు. దీంతో బంగ్లా 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 164పరుగులే చేయగలిగింది.

5. 133పరుగుల తేడాతో విక్టరీ
   మన బౌలర్లు రవి  బిష్ణోయ్3  మయాంక్ యాదవ్ 2 నితీశ్, వాషింగ్టన్ చెరో వికెట్ తీసుకోవటంతో భారత్ బంగ్లాపై 133 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. టీ20ల్లో భారత్ కు ఇది మూడో అతి పెద్ద విజయం. ఈ విజయంతో భారత్ బంగ్లా తో టీ20 సిరీస్ 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram