రెజ్లర్లు ఏం తినరు, వెయిట్ లాస్ అనేది ఓ టార్చర్ - పుల్లెల గోపీచంద్

Continues below advertisement

ABP Southern Rising Summit 2024 Hyderabad: పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand) ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అంతర్జాతీయ కోచ్. 2001లో చైనాకు చెందిన చెన్‌హాంగ్ ను ఓడించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచారు. ఈ ఘనతను సాధించిన రెండో భారతీయుడిగా పుల్లెల గోపీచంద్ నిల్చారు. 1980లో ఈ ఘనతను ప్రకాష్ పడుకోనె మాత్రమే సాధించారు. పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand Full Speech) సాధించిన ఈ అపురూప విజయానికి గుర్తింపుగా 1999లో అర్జున పురస్కారం ఆయన్ను వరించింది. 2000-01 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించింది. 2005లో భారత ప్రభుత్వం పుల్లెల గోపీచంద్‌కు పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో గోపీచంద్ ఓ బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలోనే సైనా నెహ్వాల్, పీవీ సింధూ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారు. జూలై 29, 2009న గోపీచంద్ కు ద్రోణాచార్య పురస్కారం.. 2014లో పద్మభూషణ్ అవార్డు కూడా గోపీచంద్ కు వచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram