Hardik Pandya to loose 70percent of Assets | భరణం కింద Natasa Stankovic ఎన్ని కోట్లు అడిగిందంటే..?

Continues below advertisement

 టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చాలా పేద కుటుంబం నుంచి క్రికెట్ లో తమ నైపుణ్యం చూపించటం ద్వారా పాండ్యా సోదరులు ఎదిగారు. టాలెంట్ తో పాటు బ్రాండ్ ఇమేజ్ ను పెంచుకుని ఆర్థికంగానూ స్థిరపడ్డారు. ఆరేళ్ల క్రితం తను ప్రేమించిన సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్ ను నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య ఏర్పడిన విబేధాల కారణంగా విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందుకోసం నటాషా భారీగా భరణాన్ని ఆశిస్తోంది. భారతీయ వివాహ చట్టం ప్రకారం తనకు, తన బిడ్డకు కలిపి పాండ్యా ఆస్తిలో 70శాతం భరణం ఇవ్వాలని డిమాండ్ చేస్తోందంట. ఇదే విషయాన్ని ఆమె తరపు లాయర్లు పాండ్యా కుటుంబం ముందు ఉంచారట. హార్దిక్ పాండ్యా పేరు మీద ప్రస్తుతం 160కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వీటిలో 70శాతం అంటే 112కోట్ల రూపాయలు ఇప్పుడు భరణంగా హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు చెల్లించాల్సి ఉంటుంది. సెర్బియా మహిళ కావటంతో అక్కడి చట్టాల ప్రకారమూ ఆమె భరణాన్ని అడుగుతున్నట్లు తెలుస్తోంది. విడాకులపై ఇద్దరూ అధికారిక ప్రకటన చేయకపోయినా నటాషా ఆమె బాయ్ ఫ్రెండ్ తో బయట కనిపిస్తుండంటో ఇప్పుడు ఈ ఊహాగానాలకు మరింత ఊతం ఇచ్చినట్లైంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram