SRH owner Kavya Maran in Tears | IPL 2024 Final లో KKR vs SRH మ్యాచ్ ఓడాక కావ్యా కన్నీళ్లు | ABP

Continues below advertisement

ఏ బ్యాటింగ్ బలంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోర్లను అవలీలగా నమోదు చేసిందో అదే బ్యాటింగ్ బలహీనతగా మారి చివరి అంకంలో డీలాపడటంతో సన్ రైజర్స్ కప్పును కోల్ కతా కోల్పోలేక తప్పలేదు. ఇంక అంతే సన్ రైజర్స్ అంతా ఎమోషనల్ అయిపోయారు. సన్ రైజర్స్ ఓనర్ అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ అయిన కావ్యా మారన్ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఉబికి వస్తున్న ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక కెమెరాకు కనపడకుండా వెనక్కి తిరిగి ఏడ్చేశారు. చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా కావ్యాను ఓదార్చటం కనిపించింది. ఇంతలోనే తనను తను తమాయించుకుని విజేతలుగా నిలిచిన కేకేఆర్ ను, ఓడినా హృదయాలు గెల్చుకున్న సన్ రైజర్స్ ను అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కొట్టారు. సన్ రైజర్స్ మ్యాచ్ అంటే చాలు కెమెరా మ్యాన్ ఫోకస్ చేసే కావ్యా పాప కేరింతల ప్లేస్ లో ఈసారి కన్నీళ్లు కనిపించటం అందరినీ కదిలించివేసింది. కావ్యా ఎమోషనల్ అయిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram