Deepali 2021: ఐదు రోజుల పండుగ దీపావళి... ధంతేరాస్ నుంచి భగనీహస్తం భోజనం ప్రతిరోజూ ప్రత్యేకమే
వెలుగుల పండుగ దీపావళి అంటే అందరకీ సందడే . కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను ఐదు రోజుల పాటూ జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ధ విదియతో ముగుస్తాయి. ద్వాపర యుగంలో దీపావళి ప్రస్తావనపై ఓ కథనం ఉంది. భూదేవి-వరాహ స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీమహావిష్ణువుకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని చెబుతారు. ఇక ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదురోజుల పాటూ సెలబ్రేట్ చేసుకుంటారు.