Usha Vance Chilukuri on Donald Trump Win | US Elections 2024 లో ట్రంప్ గెలుపు వెనుక తెలుగమ్మాయి

Continues below advertisement

 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో చరిత్రలో తొలిసారిగా ఓ తెలుగు అమ్మాయికి వైట్ హౌస్ అఫీషియల్ ఎంట్రీ దొరికనట్లైంది. ట్రంప్ సునాయాస విజయంతో ఆయన ఉపాధ్యక్షుడిగా జేడీ వ్యాన్స్ కి అవకాశం దక్కనుంది. జేడీ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి. ప్రస్తుతం ఓహియో స్టేట్‌కు సెనేటర్‌గా ఉన్న జేడీ వాన్స్ శ్వేతజాతీయుడు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులు దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లి సెటిల్ అయ్యారు.  ఉషా న్యాయవిద్యను పూర్తి చేసి సుప్రీంకోర్టులో లా కర్క్‌గా పనిచేశారు. జేడీ వాన్స్ తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఓ పుస్తకాన్ని రాసుకున్నారు. ఆ పుస్తకం ఆధారంగా Hillbilly Elegy అనే సినిమాను 2020లో నెట్ ఫ్లిక్స్(Netflix) తీసింది. స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన భారత సంతతి నటి ఫ్రీదా పింటో ఆ సినిమాలో ఉషా చిలుకూరి పాత్రను పోషించారు. ఇప్పుడు ట్రంప్ విజయంతో అమెరికా ఉపాధ్యక్షుడి భార్యగా ఉషా చిలుకూరి వైట్ హౌస్ కార్యక్రమాలకు రాయల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram