వీడియో: మా ఇంటికి దేవుడు వచ్చి టీ చేసిచ్చాడు

Chandrababu Latest News: చంద్రబాబు నవంబర్ 1న దీపం పథకం ప్రారంభం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురంలో లబ్ధిదారు శాంతమ్మ ఇంటికెళ్లి సిలిండర్‌ అందించారు. స్వయంగా గ్యాస్‌ స్టవ్‌ సిలిండర్‌ బిగించడంతో పాటు పొయ్యి వెలిగించి టీ తయారు చేసి తాగారు. టీ తాగినందుకు డబ్బులివ్వాలని, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని నవ్విస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుకి సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారు శాంతమ్మ ఆర్థిక, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఈదుపురంలో దీపం పథకంలో చంద్రబాబు పర్యటనలో ఓ ఇంటికి వెళ్లి ఆయనే సొంతంగా టీ తయారుచేసి వాళ్ళందరికీ ఇచ్చారు. ఆ టీ ఎలా తయారు చేశారు. వాళ్లంతా ఆనందపడ్డారో ఎవరా కుటుంబం. శాంతమ్మ త్రినాధులు కుటుంబంలో చంద్రబాబు రావడంతో ఆల్ ఇంట్లో టీ తాగడంతో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.              

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola