ఢిల్లీకి వెళ్తున్న పవన్ కళ్యాణ్, రీజన్ ఇదేనా?

Pawan Kalyan Delhi Tour: నేడు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరుగుతున్నసంగతి తెలిసిందే. ఆ సమావేశం ముగిసిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను పవన్‌ కలవనున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్ఢర్‌ పూర్తిగా విఫలమైందని పవన్‌ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో హోంమంత్రి వంగలపూడి అనితను కూడా పవన్‌ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం లుకలుకలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని కలిగిస్తోంది.

ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6.30 నుండి 7 గంటల వరకూ ఆయనతో సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక విషయాలపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola