Pakistan Embassy in Serbia hacked? పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
Continues below advertisement
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై సొంత అధికారులే తిరుగుబాటు ప్రకటించారు. తమకు జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ సర్కార్‌కు సొంత ప్రభుత్వ ఉద్యోగుల నుంచే అవమానాలు ఎదురవుతున్నాయి. ఏకంగా దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పైనే ఉద్యోగులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా సెర్బియాలోని పాకిస్థాన్ ఎంబసీ ఇమ్రాన్ ఖాన్‌పై వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేసింది. తమకు మూడు నెలల నుంచి జీతాలు ఎందుకు చెల్లించలేదని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Continues below advertisement