కంగనా రనౌత్ ను అడ్డుకున్న రైతులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును పంజాబ్ లో ని కీరత్ పుర్ లో రైతులు అడ్డుకున్నారు. చండీఘడ్-ఉనా హైవేపై ఉన్న ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో చేరుకున్న రైతులు అటుగా వెళ్తున్న కంగనా కారును ఆపారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులను చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ ఘటనపై మాట్లాడిన కంగనా....రైతు నిరసనలపై తాను పోస్టులు చేసినప్పటి నుంచి నిరంతరం తనకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. కొన్ని విచ్ఛిన్నకర శక్తులు పంజాబ్ లో తనపై రైతులను పంపించాయని..అయితే అందులో కొంత మంది మహిళా రైతులు తనను కాపాడారని తెలిపారు. రైతులకు, తనకు మధ్య ఉన్న మనస్పర్థలు ఈ ఘటనతో తొలిగిపోయాయన్న కంగనా....తన కోసం మద్దతిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు.