Telangana :ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెన్ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది
Continues below advertisement
తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ రీ ఓపెనింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అన్ని రకాల పాఠశాలలు యథావిధిగా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే పాఠశాలల్లో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కారణంగా విధించిన ఆంక్షలను తొలగిస్తున్నాయి. స్కూళ్లను తెరుస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యా సంస్థల రీ ఓపెన్‌కు తెలంగాణ వైద్య, విద్య శాఖల అధికారులు మొగ్గు చూపారు.
Continues below advertisement