Fire Gun : ఎల్ పిజి గ్యాస్ ద్వారా ఫైర్ గన్ తయారు చేసిన జగిత్యాల రైతు
జగిత్యాల జిల్లా మెట్ పల్లి కి చెందిన రైతు అల్లాడి ప్రభాకర్. అడవులకు సమీపంలో ఉంటున్న రైతులు ,గ్రామస్తులపై స్థానిక ప్రాంతాలలో సంచరించే వన్య ప్రాణులు దాడులు చేయడం వలన మృత్యువాత పడుతున్నారని తరచూ వార్తలు రావడం తో,అది చూసి చలించి వాటి నుండి రక్షణ పొందేందుకు ఎల్ పిజి గ్యాస్ ద్వారా ఫైర్ గన్ తయారు చేసినట్లు తెలిపాడు.దీంతో ఎలాంటి వన్యప్రాణులు అయినా దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఫైర్ గన్ తో రక్షణ పొందవచ్చని సదరు రైతు అంటున్నారు.