Viral Video: ఏనుగుల దారి దోపిడీ... లారీ అప్పగించి డ్రైవర్ పరార్... వైరల్ అవుతున్న వీడియో
ABP Desam
Updated at:
07 Aug 2021 05:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళనాడులోని ఈ-రోడ్ సత్యమంగళం వద్ద ఏనుగులు హల్ చల్ చేశాయని ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సత్యమంగళం-మైసూరు జాతీయ రహదారిపై చెరకు లోడ్డుతో వెళ్తోన్న ఓ లారీని ఏనుగులు అడ్డగించాయి. ఒక్కసారిగా రోడ్డుపై వచ్చిన ఏనుగులు చెరకు లారీని నిలిపివేసి, చెరకును ఆరగించడం మొదలుపెట్టాయి. దీంతో చేసేదేమీ లేక లారీ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేసి పరుగులు తీశాడు. సుమారు గంట పాటు రహదారిలో ఏనుగులు గుంపు హల్ చేశాయి. చెరకు తింటూ రోడ్డుకు అడ్డంగా ఏనుగులు నిలిచిఉండడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.