Vijayawada Sub Collector: రైతు వేషంలో సబ్‌కలెక్టర్.. క్షణాల్లో మారిన సీన్
Continues below advertisement
లుంగీ కట్టి సాధారణ రైతులా బైకుపై ఎరువుల దుకాణానికి వెళ్లారు కృష్టా జిల్లా విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్. ఓ షాపులో డీఏపీ ఎరువులు అడగ్గా.. లేవని సమాధానం రావడంతో మరో షాపులోకి వెళ్లి డీఏపీ బస్తాలు, యూరియా తీసుకున్నారు. బిల్లు అడిగితే పేపరుపై రాసిచ్చాడు. గోదాముకు వెళ్లి తాను కొన్న ఎరువుల సంచులను తీసుకుని షాపు వద్దకు రాగానే సీన్ మారిపోయింది. అధికార యంత్రాంగం అక్షడ ప్రత్యక్షం కావడంతో ఆనందించడం రైతుల వంతు కాగా, దుకాణదారులు తెల్లముఖాలు వేశారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడంతో పాటు బిల్లులు సైతం ఇవ్వడం లేదని సమాచారంతో సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ రైతు వేషంలో వచ్చి వారి ఆట కట్టించారు. ఆ రెండు ఎరువు దుకాణాలను సీజ్ చేయించాలని అధికారులను ఆదేశించారు. వారు షాపులను సీజ్ చేశారు.
Continues below advertisement
Tags :
Vijayawada Andhra Predesh Krishna District Sub Collector Surya Sai Praveen Chand Fertilizer Shop Seize Farmers