Srinivas Goud: సీఎం కేసీఆర్ వల్ల జిల్లాకో పర్యటక ప్రాంతం వచ్చింది
Continues below advertisement
వరంగల్ జిల్లా లక్నవరంలో సస్పెన్షన్ బ్రిడ్జి, 24 కాటేజ్ లు, 2 గ్లాస్ కాటేజ్ లను మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. తెలంగాణలో గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ వల్ల జిల్లాకి ఒక అభివృద్ధి ప్రాంతం ఏర్పడుతోందని మంత్రులన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రామప్పకు యునెస్కో గుర్తింపు, పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామంగా గుర్తింపు వచ్చిందన్నారు. లక్నవరంలో ఉన్న మరో 9 దీవులను అభివృద్ధి చేస్తామని.. వాటితో పాటే బొగత, మల్లూరు జలపాతాల్లోనూ మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు.
Continues below advertisement