దక్షిణాది భాషల్లో ఓ సినిమాను సమర్పిస్తున్న రాజమౌళి...ఏంటా మూవీ?
Continues below advertisement
రాజమౌళి... జక్కన్న అనండి, దర్శక ధీరుడు అనండి.... ఇప్పుడు ఈ పేరే ఓ బ్రాండ్. ఆ బ్రాండ్ ఓ బాలీవుడ్ సినిమాతో అసోసియేట్ అయ్యింది. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో ప్రజెంట్ చేస్తోంది. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా... అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రల్లో ప్రముఖ హిందీ దర్శక - నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రాజమౌళి సమర్పణలో ఈ సినిమా విడుదల కానుంది. గతంలో 'అందాల రాక్షసి' సినిమా నచ్చడంతో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు.
Continues below advertisement