సఖీ కేంద్ర శాశ్వత సొంత భవనాన్ని ములుగు జిల్లాలో ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్.

Continues below advertisement

మహిళల అన్ని సమస్యల పరిష్కారం కోసం వన్ స్టాప్ సెంటర్ గా పని చేస్తున్న సఖీ కేంద్ర శాశ్వత సొంత భవనాన్ని ములుగు జిల్లాలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. 49 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ భవనంలో మహిళలకు అత్యవసర పునరావాసం కోసం గదులు, పోలీస్ సాయం, న్యాయ సాయం, వైద్య సాయం వంటి అన్ని వసతులు ఈ భవనంలో ఉంటాయని చెప్పారు.దీంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ రవాణా సదుపాయం పథకం(రూరల్ ట్రాన్స్పోర్టేషన్ స్కీం) కింద కోటి రూపాయల విలువైన 10 రవాణా వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram