Medaram Jathara: మేడారం జాతరకు సీఎం కేసీఆర్ వెళ్లేది అప్పుడే!

Continues below advertisement

సమ్మక్క- సారలమ్మ జాతర సమీపిస్తుండగా... మేడారంలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకిరణ్ రెడ్డి, ఎర్రబెల్లి, సీఎస్, డీజీపీ కలిసి పర్యటించారు. తెలంగాణ వచ్చాకే జాతరకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని... ఈ ఏడాది జరిగే జాతర కోసం 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర జరగనుండగా... సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 18న మేడారానికి వచ్చే అవకాశముందన్నారు. భక్తుల తాకిడికి తగినట్లు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశామని, 1100 ఎకరాల్లో 30 పార్కింగ్ కేంద్రాలను పెట్టామన్నారు. కొవిడ్, ఒమిక్రాన్ దృష్ట్యా మేడారంతో పాటు ములుగు, ఏటూరు నాగారం, పరకాల వద్ద ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram